కేరళలో 24 గంటల్లో 19325 కరోనా పాజిటివ్ కేసులు, 143 మరణాలు నమోదు

Corona Positive Cases in Kerala , Corona Positive Cases In Kerala , Kerala , Kerala , Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Coronavirus, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala COVID 19,mango news

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,21,070 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 19,325 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 15.96 శాతంగా నమోదైంది.

అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,88,813 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 143 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,439 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 27,266 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 42,83,963 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here