కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ రేపటితో అనగా మే 31 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది. దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ఈ రోజు ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలు: ఫేజ్ 3 లో నిర్ణయం తీసుకునేది వీటిపైనే:
–>కరోనా వ్యాప్తి, పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఈ కింది కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే తేదీలు నిర్ణయించబడతాయి. అప్పటివరకు వీటికి అనుమతి లేదు.
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినవి మినహా ప్రయాణీకుల అంతర్జాతీయ విమాన ప్రయాణం
- మెట్రో రైళ్లు
- సినిమా థియేటర్స్
- జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, బార్లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్ళు
- సామాజిక రాజకీయ/ క్రీడలు / వినోదం / విద్యా / సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు, బహిరంగ సభలు
లాక్డౌన్ 5.0 ఇతర మార్గదర్శకాలు:
- రాత్రి కర్ఫ్యూ – అవసరమైన కార్యకలాపాలు మినహా దేశవ్యాప్తంగా రాత్రి 9.00 నుండి ఉదయం 5.00 గంటల వరకు పాటించాలి.
- జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అమలు.
- కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను అధికారులు గుర్తిస్తారు.
- కంటైన్మెంట్ జోన్లలో అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి.
- కంటైన్మెంట్ జోన్ల వెలుపల బఫర్ జోన్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించవచ్చు.
- రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా పరిస్థితిని అంచనా వేయడం ద్వారా, కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రాంతాల్లో కూడా కొన్ని కార్యకలాపాలను నిషేధించవచ్చు మరియు అవసరమని భావిస్తే ప్రజల కదలికలు, ప్రయాణాలపై పరిమితులను విధించవచ్చు.
- అంతర్-రాష్ట్ర మరియు రాష్ట్రంలో ప్రయాణాలకు, రవాణాకు ఎటువంటి నిషేధం లేదు.
- వ్యక్తుల ప్రయాణాలకు, వస్తువుల రవాణాకు ప్రత్యేక అనుమతి/ఇ-పర్మిట్ అవసరం లేదు.
- అయితే రాష్ట్రాల మధ్య ప్రయాణానికి ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉండాలి.
- 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అవసరమైన మరియు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే బయటకు రావాలని, లేకుంటే ఇంట్లో ఉండాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu