లండన్‌: బ్రిట‌న్ కొత్త రాజుగా ప్రమాణం చేసిన దివంగత రాణి ఎలిజబెత్ కుమారుడు ఛార్లెస్‌-3

London King Charles III Formally Declares Britain's New Monarch at Historic Ceremony, Britain's New Monarch at Historic Ceremony, London King Charles III, Britain's New Monarch, King Charles III formally proclaimed Britain's new monarch, England Queen Queen Elizabeth II, King Charles Britains Monarch, King Charles Britains New King, King Charles III, King Charles III Latest News And Updates, King Charles III New British King, King Charles III New Monarch, King Charles III Proclaimed Britains Monarch In Historic Event, King Charles III To Be Britains Monarch In Historic Event, King Charles Proclaimed Britain’s Monarch, Mango News, Queen Elizabeth II Death Live Updates, Queen Elizabeth II Latest News And Updates

దివంగత రాణి ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు కింగ్ ఛార్లెస్-3 సెప్టెంబరు 10న బ్రిటన్ కొత్త చక్రవర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు చరిత్రలో మొదటిసారిగా ప్రసారమైన లండన్‌లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్ యొక్క చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ కొత్త చక్రవర్తిని అధికారికంగా ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత 73 ఏళ్ల మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ నేడు జరిగిన వేడుక లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అతని అధికారిక ప్రకటన అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఛార్లెస్‌-3ని రాజుగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆయ‌న దానికి సంబంధినచిన డాక్యుమెంట్‌పై లాంఛనంగా సంత‌కం చేశారు. కాగా ఆయన ఆ డాక్యుమెంట్‌పై సంత‌కం చేయ‌డానికి ముందు రూమ్‌లో ఉన్న అంద‌రూ ‘గాడ్ సేవ్ ద కింగ్’ అని కౌన్సిల్ క్లర్క్ చేసిన ప్రకటనను పునరుద్ఘాటించారు. ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధ‌ర్ జార్జ్‌, ఛార్లెస్ -3ని బ్రిట‌న్ రాజుగా ప్ర‌క‌టించగానే సమావేశానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో ఆమోదం తెలిపారు.

ఇక కింగ్ చార్లెస్‌తో పాటు అతని భార్య, క్వీన్ కన్సార్ట్ గా కెమిల్లా మరియు అతని కుమారుడు ప్రిన్స్ విలియం కొత్త ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా లాంఛనంగా ఎంపికయ్యారు. దివంగత రాణికి సంతాపం తెలుపుతూ ప్యాలెస్‌పై దించబడిన జెండాలు యాక్సెషన్ కౌన్సిల్ ప్రకటన తర్వాత తిరిగి యధాతథ స్థితికి తీసుకురాబడ్డాయి. ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్ త‌న త‌ల్లి ఎలిజబెత్ మ‌ర‌ణ‌వార్త‌పై భావోద్వేగ ప్ర‌క‌ట‌న చేశారు. ‘సదా తోటివారిపై ప్రేమ‌ను పంచాల‌ని, నిస్వార్థ సేవ చేయాల‌ని నా త‌ల్లి నాకు నేర్పిన‌ విధంగా నేనూ ఇప్పుడు దేవుడు నాకు అనుగ్రహించే మిగిలిన సమయంలో, మన దేశం యొక్క నడిబొడ్డున రాజ్యాంగ సూత్రాలను సమర్థిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని కింగ్ చార్లెస్ పేర్కొన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ఇటీవలే బ్రిట‌న్ నూతన ప్ర‌ధానిగా ఎన్నికైన లిజ్ ట్ర‌స్‌తో పాటు మరో ఆరుగురు మాజీ ప్ర‌ధానమంత్రులు కూడా హాజరవడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =