ఓట్ల చోరీ నిజం.. అందుకే నాపై ఒక్క కేసూ నమోదు కాలేదు – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

LoP Rahul Gandhi Targets Modi-Shah and CEC Gyanesh Kumar Over Alleged Electoral Irregularities

దేశంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఓట్ల చోరీ’ ప్రణాళికను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే రూపొందించారని ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు.

ఈ మేరకు తాజాగా దక్షిణ గోవాలోని మార్గావ్‌లో నిర్వహించిన ‘గోవా రక్షణ యాత్ర’ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. తెరవెనుక ప్రధాని మోదీ రచించిన ఈ ఓట్ల చోరీ ప్రణాళికను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యరూపంలోకి తీసుకొచ్చారని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ దానిని అమలు చేశారని రాహుల్ ఆరోపించారు.

ప్రస్తుతం ఈ ముగ్గురూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, తాము చేసిన తప్పునకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. తనపై ఇప్పటికే 45కు పైగా పరువు నష్టం కేసులు ఉన్నాయని, అయితే ఓట్ల చోరీలో ప్రధాని పాత్ర ఉందని తాను నేరుగా ఆరోపిస్తున్నప్పటికీ తనపై ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కేసు పెడితే న్యాయస్థానాలలో ఈ బండారం మొత్తం బయటపడుతుందనే భయంతోనే వారు ఆ సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here