ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఆర్టెమిస్-1 ను నేడు చంద్రుడి పైకి పంపనున్న ‘నాసా’

NASA To Re-Attempt For Launching The World’s Most Powerful Rocket Artemis-1 to Moon Tonight, World’s Most Powerful Rocket Artemis-1, NASA To Re-Attempt For Launching The World’s Most Powerful Rocket Artemis-1, Nasa will make a second attempt to fly its pioneering Artemis 1 moon rocket, Artemis 1 moon rocket, World’s Most Powerful Rocket to Moon, NASA to re-attempt launch of Artemis-1, Artemis-1 Rocket, Artemis-1 mission to the Moon, Artemis-1 Rocket News, Artemis-1 Rocket Latest News And Updates, Artemis-1 Rocket Live Updates, Mango News, Mango News Telugu,

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఆర్టెమిస్-1 ను నేడు ప్రయోగించనుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39బి నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రయోగం నేటి రాత్రి 11:45 గంటలకు షెడ్యూల్ చేశారు. కాగా అపోలో 11 ద్వారా 16 జూలై 1969–20 జూలై 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం చంద్రుడిపైన ల్యాండ్ అయిన తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ అమెరికా ఇలాంటి ప్రయోగం చేయలేదు.

భవిష్యత్తులో మానవులు చంద్రుడి ఉపరితలం పైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నాసా ఆర్టెమిస్‌-1ను చేపట్టింది. కాగా ఆర్టెమిస్ 1 ఫ్లైట్ టెస్ట్ అనేది చంద్రుని చుట్టూ సిబ్బంది లేని మిషన్ అని, ఇది ఆర్టెమిస్‌లో భాగంగా సిబ్బందితో కూడిన ఫ్లైట్ టెస్ట్ కు మరియు భవిష్యత్తులో హ్యూమన్ లూనార్ అన్వేషణకు మార్గం సుగమం చేస్తుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ముందుగా ఆర్టెమిస్‌ 1 ప్రయోగాన్ని ఆగస్ట్ 29, సోమవారం ఉదయం తలపెట్టగా, చివరి గంటలో వాయిదా పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఆర్ఎస్-25 ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్టుగా నాసా ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =