ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం

PM Modi and Political Leaders Film Celebrities Expressed Grief Over Passing Away of Actor Krishnam Raju, PM Modi Expressed Grief on Krishnam Raju Death, Film Celebrities Expressed Grief Over Krishnam Raju Death, Celebrities Pays Tribute To Krishnam Raju, Rebel Star Krishnam Raju, Mango News, Mango News Telugu, Senior Actor Krishnam Raju, Telugu Senior Actor Krishnam Raju, Krishnam Raju Passes Away, Krishnam Raju Dies At 83, Krishnam Raju Died, Tollywood Latest News, Krishnam Raju Last Rites

ప్రముఖ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, తోటి నటి నటులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

యువి కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరం. రాబోయే తరాలు ఆయన నటనా గొప్పతనాన్ని, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయి. సమాజ సేవలో కూడా ముందుండే ఆయన రాజకీయ నేతగా ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి – ప్రధాని నరేంద్ర మోదీ

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు నాకు అత్యంత ఆత్మీయులు. వాజ్ పేయి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించే వారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరం – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో మరియు సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి – కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా – ఏపీ సీఎం వైఎస్ జగన్

ప్రముఖ తెలుగు నటుడు మరియు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఆకస్మిక మృతికి హృదయపూర్వక సంతాపం – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్

కేంద్ర మాజీ మంత్రి, ‘రెబల్‌స్టార్‌’గా పేరొందిన ప్రముఖ తెలుగు సినీనటుడు యువి కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం, విచారం వ్యక్తం చేస్తున్నాను – ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి అకాల మరణం పార్టీకి, సమాజానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను – టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ మాజీ ఎంపీ యువి కృష్ణంరాజు మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన సినీ ప్రేక్షకుల చేత ‘రెబల్‌ స్టార్‌’గా పేరుగాంచారు. ఇది తెలుగు వారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

ఉభయగోదావరి జిల్లా నుండి బీజేపీ తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =