మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Congratulates Megastar Chiranjeevi on being Conferred Indian Film Personality of the Year-2022 Award,PM Narendra Modi congratulated Chiranjeevi,Indian Film Personality Of Year 2022,Megastar Chiranjeevi,Indian Film Personality of the Year-2022,IFFI Award 2022,Indian Film Personality Award, Mango News,Mango News Telugu,Chiranjeevi IFFI Award 2022,Chiranjeevi IFFI Award,Chiranjeevi Latest News And Updates,Megastar Chiranjeevi News And Updates,Megastar Of Tollywood, Tollywood Latest News,Latest Tollywood Releases,Telugu Movies, Telugu Movies News,

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా, ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్​ చిరంజీవిని ఐఎఫ్ఎఫ్ఐ ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డ్ కు ఎంపిక చేస్తున్నట్టుగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డ్ దక్కడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, నటి నటులు, నిర్మాతలు, దర్శకులు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 15 =