అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ

Biden to host PM Modi at White House on Sept 24, In-Person Meet With President Joe Biden, Joe Biden to host PM Modi for bilateral meeting, Mango News, Narendra Modi in US LIVE Updates:, PM Modi departs for three-day visit to US, PM Modi to Visit, PM Modi to Visit US from September 22 to 26, PM Modi US visit LIVE Updates, PM Modi US visit Updates, PM Modi’s US visit to begin from today, PM Will Meet US President Joe Biden in White House, US President Joe Biden

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రధాన మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ 22 నుండి 25 వరకు కొనసాగనుంది. పర్యటన అనంతరం సెప్టెంబర్ 26న భారతదేశానికి తిరిగి రానున్నారు. ఈ పర్యటనలో ప్రధానితో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, ఫారెన్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఈ పర్యటనలో అమెరికా నాయకత్వంతో ద్వైపాక్షిక సమావేశాలు, క్వాడ్‌ నాయకుల సమ్మిట్‌లో పాల్గొనడం, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగం మరియు వ్యాపార పరస్పర చర్యలును ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు.

ఇక ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జో బైడెన్ తో ప్రధాని మోదీ మొదటిసారిగా వ్యక్తిగతంగా భేటీ కాబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్వహించే కోవిడ్-19 గ్లోబల్ సమ్మిట్‌లో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు. సెప్టెంబర్ 24 న వారిమధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశంలో బలమైన మరియు బహుముఖ భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాన్ని వారు సమీక్షిస్తారు. అలాగే రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌ని ఎలా మరింత సుసంపన్నం చేయవచ్చో కూడా వారు చర్చించనున్నారు. ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తో కూడా ప్రధాని సమావేశం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ పర్యటనలో కొందరు అమెరికా కంపెనీల సీఈవోలతో కూడా ప్రధాని మోదీ సమావేశాలు ఉంటాయని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడిందింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =