ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డ్

Australian Open, Australian Open 2022, Creates History By Win 21 Grand Slam Titles, Mango News, Rafael Nadal creates history, Rafael Nadal creates history by winning record, Rafael Nadal makes history, Rafael Nadal Makes History In Australian Open Five-Set Classic, Rafael Nadal rallies to win Australian Open, Rafael Nadal Wins Australian Open, Rafael Nadal Wins Australian Open-2022 Title, Rafael Nadal Wins Australian Open-2022 Title Creates History By Win 21 Grand Slam Titles, wins record 21st Grand Slam title

ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్‌ టైటిల్ ను ఆరో సీడ్, స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ రెండోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు అయిదున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు, రెండో సీడ్ మెద్వెదెవ్‌ పై 2-6, 6-7 (5-7), 6-4, 6-4, 7-5తో అద్భుత విజయం సాధించి మరో గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకున్నాడు. రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇది రెండోసారికాగా, తొలిసారి 2009లో టైటిల్‌ గెలుచుకున్నాడు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ రికార్డ్:

ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో, 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా అవతరించి, రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ఆటగాళ్ళుగా రఫెల్ నాదల్(20), రోజర్ ఫెదరర్‌ (20), నోవాక్‌ జకోవిచ్‌ (20) సమంగా ఉండగా, తాజా విజయంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (21) గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన రఫెల్ నాదల్ కు రోజర్ ఫెదరర్, నోవాక్ జొకోవిచ్ లు శుభాకాంక్షలు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twenty =