ప్రపంచ కుబేరుల్లో 4 వ స్థానానికి చేరుకున్న ముకేశ్‌ అంబానీ

Mukesh Ambani, Mukesh Ambani Becomes 4th Richest, Mukesh Ambani Becomes 4th Richest in the World, Mukesh Ambani eclipses richest European, Mukesh Ambani overtakes wealthiest European, Reliance Industries, Reliance Industries Chairman, Reliance Industries Chairman Mukesh Ambani

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. తాజాగా ఆయన ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల జాబితాలో 4 వ స్థానానికి చేరుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్ విలువ రూ.80.6 బిలియన్‌ డాలర్లుకు చేరడంతో ప్రపంచ కుబేరుల్లో 4 వ స్థానానికి ఎగబాకి మరో మైలురాయికి అధిగమించారు. ముఖేశ్‌ అంబానీ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌, సెర్జె బ్రిన్‌, ల్యారీ పేజ్‌, వారెన్‌ బఫెట్‌ వంటి దిగ్గజాలను దాటేయగా, తాజాగా 5 వ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్‌ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం మొదటి మూడు స్థానాలలో అమెజాన్‌ చైర్మన్ జెఫ్‌ బెజోస్‌ (187 బిలియన్‌ డాలర్లు), మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌ (121 బిలియన్‌ డాలర్లు), ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ( 102 బిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =