కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్, ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్లు దాటిన ఫాలోవర్స్‌

Century machine, Fans celebrate as Virat Kohli Becomes First Cricketer to Cross 100 Million Followers, first cricket star to hit 100 million followers, Kohli becomes first cricketer to have 100 million followers, Mango News, Team India Captain Virat Kohli, Virat Kohli, Virat Kohli Becomes First Cricketer to Cross 100 Million Followers, Virat Kohli Becomes First Cricketer to Cross 100 Million Followers on Instagram, Virat Kohli Instagram, Virat Kohli Instagram Followers, Virat Kohli Latest News, Virat Kohli News

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తొలి క్రికెటర్ గానే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ కు సంబంధించి దేశంలో ఈ మైలురాయి చేరుకున్న తొలి ఇండియన్ సెలబ్రెటీగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇన్‌స్టాలో 10 కోట్ల (100 మిలియన్ల) ఫాలోవర్స్ తో కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇక కోహ్లీకి సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్‌లో 40.8 మిలియన్లకు పైగా, పేస్ బుక్ లో 43.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ కు సంబంధించి క్రీడాకారుల్లో పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోని అత్యధికంగా 266 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అర్జెంటైనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ 187 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో, బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ 147 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 100 మిలియన్ల ఫాలోవర్స్‌ను దాటిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =