ఉక్రెయిన్‌లోని ‘మారియుపోల్’ సిటీని స్వాధీనం చేసుకున్న రష్యా.. విముక్తి కల్పించామన్న అధ్యక్షుడు పుతిన్

Ukraine Crisis Russia President Putin Announces Mariupol City Successfully Liberated, Russia President Putin Announces Mariupol City Successfully Liberated, Mariupol City, Putin Announces Mariupol City Successfully Liberated, Russia President Putin, Russia President, President Putin, Putin, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Updates, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కీలక ప్రకటన చేశారు. అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌తో పాటు ఉక్రేనియన్ ఓడరేవు నగరాన్ని వశపరుచుకున్నామని రక్షణ మంత్రి ‘సెర్గీ షోయిగు’ ప్రకటన తర్వాత అధ్యక్షుడు పుతిన్ గురువారం మారియుపోల్‌కు విముక్తిని కలిగించామని పేర్కొన్నారు. అయితే మారియుపోల్ నగరంలోని అజోవ్‌స్టల్ ఉక్కు కర్మాగారంలోకి వెళ్లొద్దని రష్యన్ దళాలను ఆదేశించారు. అక్కడ దాదాపు 2,000 మంది ఉక్రేనియన్ సైనికులు ప్లాంట్‌లోనే ఉన్నట్లు తెలిసిందని, కానీ అక్కడి నుంచి ఎవరూ తప్పించుకోకుండా చూడాలని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద భూభాగాలను “విముక్తి” చేసేందుకు తమ దేశ బలగాలు సన్నాహాలు చేస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు చెప్పారు. అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం రష్యాకు ప్రధాన వ్యూహాత్మక విజయం. ఇది తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల భూభాగాలకు విలీనమైన క్రిమియాను అనుసంధానించడంలో సహాయపడుతుంది.

అయితే తిండి, నీరు, కరెంటు సౌకర్యం లేకుండా, ఒక నెలకు పైగా రష్యన్ దళాలచే ముట్టడి చేయబడిన నగరంలో ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలతో బయటపడటం దుర్లభం. ఉక్రేనియన్ దళాలు ఉన్న అజోవ్‌స్టాల్ స్టీల్ ఫ్యాక్టరీని మినహాయించి, మిగిలిన నగరాన్ని ఇప్పుడు రష్యా నియంత్రిస్తోంది. కాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గురువారం మాట్లాడుతూ, ఉక్రెయిన్ వైపు శాంతి చర్చలకు సంబంధించి ఒక పత్రాన్ని అందజేసిన తర్వాత కైవ్ ప్రతిస్పందన కోసం మాస్కో ఇంకా వేచి ఉందని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాపై విధించిన ఆంక్షల జాబితాలో బ్రిటన్ గురువారం 26 కొత్త హోదాలను చేర్చింది, ఇందులో సైనిక వ్యక్తులు మరియు రక్షణ సంస్థలపై కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి పశ్చిమ దేశాల ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించాలని కోరిన బ్రిటన్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా ప్రముఖ రష్యన్ బిలియనీర్లు మరియు రాజకీయ నాయకులపై ఆస్తుల స్తంభన మరియు ప్రయాణ నిషేధం వంటి వందలాది ఆంక్షలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =