దేశంలో మంకీపాక్స్ తోలి కేసు నమోదు, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

Union Health Ministry Releases Guidelines for Management of Monkeypox Disease, Guidelines for Management of Monkeypox Disease, Health Ministry Releases Guidelines for Management of Monkeypox Disease, Monkeypox Disease, India First Monkeypox Case Reported in Kerala Centre Rushes High-Level Team, Centre Rushes High-Level Team, India First Monkeypox Case Reported in Kerala, Monkeypox Case Reported in Kerala, Indias 1st monkeypox case reported in Kerala, Kerala Health Minister Veena George said That A Monkeypox positive case has been reported, A Monkeypox positive case has been reported In Kerala, Kerala Health Minister Veena George, Minister Veena George, Kerala Health Minister, Veena George, Monkeypox positive case, Monkeypox, Monkeypox Guidelines News, Monkeypox Guidelines Latest News, Monkeypox Guidelines Latest Updates, Monkeypox Guidelines Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే మంకీపాక్స్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా తాజాగా తోలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి కేరళకు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారించబడింది. ఈ మేరకు కేరళలో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ పై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మంకీపాక్స్ వ్యాధి నిర్వహణ కోసం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది.

అంతర్జాతీయ ప్రయాణీకులకు కీలక సూచనలు:

  • విదేశాల్లో ఉన్నప్పుడు చర్మ గాయాలు లేదా జననేంద్రియ గాయాలు ఉన్నవారితో సహా రోగులతో సన్నిహిత సంబంధాలతో ఉండకుండా ప్రయాణికులు దూరంగా ఉండాలి.
  • చనిపోయిన లేదా జీవించి ఉన్న ఎలుకలు, ఉడుతలు, కోతులు మరియు చింపాంజీ అడవి జంతువులను తాకకుండా దూరంగా ఉండాలి.
  • ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల నుండి చేసిన ఉత్పత్తులను (క్రీములు, లోషన్లు, పౌడర్లు) ఉపయోగించకూడదు. అలాగే వైల్డ్ గేమ్ (బుష్‌మీట్) నుండి మాంసాన్ని తినడం లేదా తయారు చేయడం చేయకూడదు.
  • జబ్బుపడిన వ్యక్తులు ఉపయోగించే కలుషితమైన వస్తువులతో (వస్త్రాలు, పరుపులు లేదా ఆరోగ్య సంరక్షణ సెట్టింగ్‌లలో ఉపయోగించే వస్తువులు వంటివి) లేదా వ్యాధి సోకిన జంతువులతో కాంటాక్ట్ అయిన వస్తువులను వాడకూడదు.
  • దద్దుర్లు జ్వరం వంటి మంకీపాక్స్ ను సూచించే లక్షణాలు కనిపించినా, మంకీ పాక్స్ నివేదించబడిన ప్రాంతంలో ఉన్నా, మంకీ పాక్స్ సోకినా వ్యక్తితో సన్నిహితంగా మెలిగినా కూడా సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి.

ఏపీహెఛ్ఓలు/ పీహెఛ్ఓలు పాత్ర:

  • ముఖ్యంగా మంకీపాక్స్ వ్యాప్తిని నివేదించే దేశాల నుండి వచ్చే ప్రయాణీకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • మంకీ పాక్స్ యొక్క క్లినికల్ ప్రెజెంటేషన్ గురించి తెలుసుకోవడం.
  • కఠినమైన థర్మల్ స్క్రీనింగ్ చేపట్టడం, గత 21 రోజులలో ప్రభావిత దేశాలకు ప్రయాణ చరిత్ర తెలుసుకోవడం.
  • గుర్తించబడిన లింక్ ఆసుపత్రికి విమానాశ్రయం/పోర్ట్ నుండి రెఫరల్ ఏర్పాట్లను చేయడం.
    అలాగే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది, ఎయిర్‌లైన్ సిబ్బంది మరియు వారితో నియమించిన ఏదైనా రాష్ట్ర ఆరోగ్య సిబ్బందికి వ్యాధి గురించి తెలిసేలా చెయ్యాలి.
  • ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం అనుసరించాల్సిన డిజ్ ఇన్ఫెక్షన్ ప్రక్రియ చేపట్టడం కోసం అనుమానిత కేసును గుర్తించడం గురించి సంబంధిత విమానయాన సంస్థలకు తెలియజేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =