ప్రధాని నరేంద్ర మోదీతో ఉపాసన భేటీ

Dubai 2020 Expo, India Pavilion, Mango News, Mango News Telugu, Mega Cousins ​​with Prime Minister Modi, Narendra Modi, pm narendra modi, PM Narendra Modi at the India Pavilion, Upasana, upasana kamineni, upasana kamineni apollo, Upasana Konidela, Upasana Konidela Meets PM, Upasana Konidela Meets PM Narendra Modi, Upasana Konidela Meets PM Narendra Modi at the India Pavilion, Upasana Konidela Meets PM Narendra Modi at the India Pavilion at the Dubai 2020 Expo, Upasana Meets PM, Upasana Meets PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం నాడు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌, ప్రముఖ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా భేటి అయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ ఫోటో కూడా షేర్ చేశారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానితో సమావేశమైనట్టు ఆమె తెలిపారు.

ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేస్తూ, “ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధాని మోదీని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎక్స్‌పోలో ఇన్నోవేషన్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, మహిళా సాధికారత మరియు సంస్కృతి పరిరక్షణ వంటివి ప్రధాన అంశాలుగా ఉండటం అద్భుతంగా ఉంది. సాంకేతికత యొక్క శక్తి మనకు అవకాశాన్ని ఇస్తుంది, మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి” అని ఉపాసన పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ట్యాగ్ ను కూడా ఉపాసన జత చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =