అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 16, ఆదివారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష 70 వేలు దాటింది. ఇప్పటిదాకా మరణించిన వారి మొత్తం సంఖ్య 1,70,052 కి చేరుకుంది. మరోవైపు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 54,04,115 కు చేరుకుంది. కరోనా నియంత్రణకు అమెరికా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 21 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 7 లక్షల మందికి పైగా ఈ వైరస్ వలన మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu