యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్ గెలుచుకున్న డానిల్‌ మెద్వెదేవ్

Daniil Medvedev Stuns Novak Djokovic, Daniil Medvedev Wins Maiden Grand Slam Title, Defeats Novak Djokovic In Final, Mango News, Novak Djokovic, Novak Djokovic vs Daniil, Novak Djokovic vs Daniil Medvedev, Novak Djokovic vs Daniil Medvedev US Open 2021 Final, US Open 2021 Final, US Open 2021 Highlights, US Open Final, US Open Men’s Final

యూఎస్‌ ఓపెన్‌ 2021 పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్ అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌ ను ఓడించి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్ ను
తన ఖాతాలో వేసుకున్నాడు. మెద్వెదేవ్ తన కెరీర్‌లో గెలుచుకున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఇది. నోవాక్‌ జకోవిచ్‌ పై వరుస సెట్లలో 6-4, 6-4, 6-4 తో విజయం సాధించి డానిల్‌ మెద్వెదేవ్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. రెండో, మూడో సెట్ లలో జకోవిచ్‌ పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగిన కూడా, మెద్వెదేవ్ ఆధిపత్యం కొనసాగిస్తూ విజయాన్ని అందుకున్నాడు.

దీంతో యూఎస్‌ ఓపెన్‌ గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు (21) సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని భావించిన జకోవిచ్‌ కలకు బ్రేక్ పడింది. జకోవిచ్ ఇప్పటివరకు తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లాములు సొంతం చేసుకుని అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన రోజర్ ఫెదరర్‌ (20), రఫెల్‌ నాదల్(20) సరసన నిలిచాడు. మరోవైపు యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ టైటిల్ ను పద్దెనిమిదేళ్ల బ్రిటన్‌ క్రీడాకారిణి ఎమ్మా రాదుకాను గెలుచుకుంది. ఎమ్మా రాదుకానుకు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 4 =