ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బాగానే ఉన్నానని ప్రకటన

Donald Trump, Donald Trump is admitted to Walter Reed hospital, Trump in hospital, Trump Moves to Walter Reed Hospital, Trump positive for coronavirus, Trump Transported to Walter Reed Hospital, US President Donald Trump, US President Donald Trump moved to Walter Reed military, Walter Reed Hospital, Walter Reed Hospital For Covid-19 Treatment

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స నిమిత్తం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం ట్రంప్ కి చికిత్స అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాను ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఓ వీడియో ద్వారా ట్రంప్ స్వయంగా వెల్లడించారు. “కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అద్భుతమైన మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వాల్టర్ రీడ్ ఆసుపత్రికి వెళ్తున్నాను. నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను, కాని అంతా సవ్యంగా ఉండేందుకు చూస్తున్నాం. ప్రథమ మహిళ మెలానియా ఆరోగ్యంగానే ఉన్నారు” అని డొనాల్డ్ ట్రంప్ వీడియో ద్వారా వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =