టోక్యో ఒలింపిక్స్ లో హాకీ, బాక్సింగ్ లో కాంస్య పతకాలు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

Boxer Lovlina, CM KCR Congratulated Hockey Team and Boxer Lovlina for Winning Bronze Medals, CM KCR Congratulated Hockey Team and Boxer Lovlina for Winning Bronze Medals in Olympics, Hockey Team and Boxer Lovlina Winning Bronze Medals, India wins bronze medal in men’s hockey, Indian Men’s Hockey Team, Indian Men’s Hockey Team wins Bronze Medal, Indian Men’s Hockey Team wins Bronze Medal At Tokyo Olympics 2020, Indian Olympic Players, Lovlina Borgohain, Mango News, Mirabai Chanu, Tokyo 2020 Highlights, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2021 Live Updates, Tokyo Olympics LIVE

టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ ను, జట్టు క్రీడాకారులను సీఎం ప్రశంసించారు.

అలాగే మహిళా బాక్సింగ్ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్ ని సీఎం అభినందించారు. ఒలింపిక్స్ లో దేశం తరపున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =