నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR Extends Greetings to the People of Telangana as well as Entire Country On the Occasion of New Year,CM KCR Extends Greetings,People of Telangana,Greetings to Entire Country,On the Occasion of New Year,New Year 2023,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,YSRTP Chief YS Sharmila,YSRTP Chief YS Sharmila Latest News and Updates

గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నూతన సంవత్సరం (2023) సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులమవుతారని సీఎం పునరుద్ఘాటించారు.

ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కుంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని సీఎం స్పష్టం చేశారు. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం కోరుకున్నారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =