రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

#GaneshChaturthi, CM KCR Greeted Telangana People On the Occasion of Vinayaka Chavithi Festival, ganesh chaturthi, Ganesh Chaturthi 2021, Ganesh Chaturthi Celebrations, Ganesh Chaturthi Celebrations 2021, Governor & CM KCR Greets People of Telangana, KCR Greeted Telangana People On the Occasion of Vinayaka Chavithi, KCR Greeted Telangana PeopleOn Vinayaka Chavithi Festival, Mango News, Telangana Ganesh Chaturthi Celebrations, Vinayaka Chavithi Festival, Vinayaka Chavithi Greetings

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవం గా హిందూ సాంప్రదాయంలో వినాయకునికి అత్యంత ప్రాధాన్యతవున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. పిల్లలనుంచి పెద్దలదాకా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే గణేషుని నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. తొమ్మిదిరోజుల పాటు సాగే ఉత్సవాలు సహా, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని పార్వతి తనయుడు గణనాథున్ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + sixteen =