ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR Mourns Death of Prominent Businessman Rahul Bajaj, Bajaj, Bajaj Auto, Bajaj Auto Former Chairman, Bajaj Auto Former Chairman Rahul Bajaj, Bajaj Auto Former Chairman Rahul Bajaj Passes Away, Bajaj Auto Former Chairman Rahul Bajaj Passes Away At 83, Bajaj Auto Groups, Bajaj Auto Latest News, Bajaj Auto Latest Updates, Bajaj Former Chairman Rahul Bajaj, Chairman Rahul Bajaj Passes Away At 83, former Chairman of Bajaj Group, Mango News, Rahul, Rahul Bajaj, Rahul Bajaj Passes Away At 83

ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి, దేశ వ్యాపార వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కృషి గొప్పదన్నారు. బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజాజీవనంలో భాగస్వామ్యం అయ్యాయన్నారు. “హమారా బజాజ్” అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తిరంగంలో స్వీయ అస్తిత్వ విధానం దిశగా చైతన్యపరిచిందని అన్నారు. రాహుల్ బజాజ్ సామాజిక బాధ్యత కలిగిన జాతీయవాద వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. రాహుల్ బజాజ్ మరణం, దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =