తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి చాకలి ఐలమ్మ జీవితమే నిదర్శనం: సీఎం కేసీఆర్

CM KCR Paid Glorious Tribute on the Occasion of Chakali Ailamma Birth Anniversary, CM KCR Paid Tribute To Chakali Ailamma, Chakali Ailamma Birth Anniversary, Chakali Ailamma, CM KCR Tribute To Chakali Ailamma, Mango News, Mango News Telugu, Chakali Ailamma Birth Anniversary, Chakali Ilamma Biography, Chakali Ilamma History, Chakali Ilamma Birth Anniversary News And Live Updates, CM KCR Latest News And Updates, Chakali Ilamma Revolutionary Bahujan Woman, CM KCR

నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చిట్యాల (చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను సీఎం స్మరించుకున్నారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని సీఎం అన్నారు. హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని సీఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =