పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తక్షణమే తగ్గించకపోతే దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన : సీఎం కేసీఆర్

CM KCR to Write a letter to PM Modi over Increase the Prices of Fertilizers, CM KCR, Write a letter to PM Modi, CM KCR to Write a letter to PM Modi, Increase the Prices of Fertilizers, letter to PM Modi over Increase the Prices of Fertilizers,, Prices of Fertilizers, Fertilizers, CM KCR expresses dissatisfaction over centre hiking fertilizers price centre hiking fertilizers price, fertilizers price, fertilizers price Latest News, fertilizers price Live Updates, CM Chandrasekhar Rao writes to PM Modi, CM Chandrasekhar Rao, Telangana CM KCR, Mango News,

దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాయనున్నట్టు తెలిపారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.

దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, ఎన్.ఆర్.జీ.ఈ. ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక కుట్ర దాగి వుందన్నారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =