విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు జోహార్లు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Participate in Police Commemoration Parade at Goshamahal Martyrs’ Memorial

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీసు స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ (Police Commemoration Day) పరేడ్‌కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసుల సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

ప్రజల ప్రాణాలను, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని పేర్కొంటూ, ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు మరియు ఆర్థిక భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలిపారు.

సమాజంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో పోలీసు శాఖ పాత్ర అత్యంత కీలకమని, కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలుస్తున్న పోలీసు సిబ్బందికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here