తెలంగాణ రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 9, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 1,29,896 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 17 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3426 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1801 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,69,086 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1813):
- ఖమ్మం – 180
- జీహెచ్ఎంసీ ఏరియా – 179
- నల్గొండ – 145
- రంగారెడ్డి – 109
- సూర్యాపేట – 91
- మేడ్చల్ మల్కాజిగిరి – 89
- భద్రాద్రి కొత్తగూడెం – 84
- కరీంనగర్ – 84
- పెద్దపల్లి – 74
- మహబూబాబాద్ – 65
- వరంగల్ అర్బన్ – 64
- మంచిర్యాల – 58
- సిద్దిపేట – 52
- వికారాబాద్ – 42
- మహబూబ్ నగర్ – 40
- ములుగు – 39
- జయశంకర్ భూపాలపల్లి – 39
- సంగారెడ్డి – 39
- జగిత్యాల – 38
- యాదాద్రి భువనగిరి – 35
- వనపర్తి – 35
- నాగర్ కర్నూల్ – 34
- రాజన్న సిరిసిల్ల – 33
- వరంగల్ రూరల్ – 30
- జోగులాంబ గద్వాల్ – 24
- జనగామ – 22
- నిజామాబాద్ – 21
- నారాయణ్ పేట్ – 18
- మెదక్ – 17
- కొమరం భీం ఆసిఫాబాద్ – 12
- నిర్మల్ – 9
- ఆదిలాబాద్ – 6
- కామారెడ్డి – 6
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ