తెలంగాణలో 36 వేలు దాటిన కరోనా కేసులు, 365 కి పెరిగిన మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతోంది. మరో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 13, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 36,221 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 11,525 శాంపిల్స్ పరీక్షించగా 9,975 మందికి నెగటివ్ వచ్చినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 365 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1197 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 23,679 కి చేరింది. ప్రస్తుతం 12,178 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1550):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 926
  2. రంగారెడ్డి – 212
  3. కరీంనగర్ – 86
  4. మేడ్చల్ – 53
  5. నల్గొండ – 41
  6. ఖమ్మం – 38
  7. కామారెడ్డి – 33
  8. సంగారెడ్డి – 19
  9. వరంగల్ అర్బన్ – 16
  10. మహబూబ్ నగర్ – 13
  11. మహబూబాబాద్ – 13
  12. జనగామ – 10
  13. సిద్దిపేట – 10
  14. సూర్యాపేట – 10
  15. భద్రాద్రి కొత్తగూడెం – 10
  16. వరంగల్ రూరల్ – 8
  17. నిజామాబాద్ – 8
  18. రాజన్న సిరిసిల్ల – 7
  19. మెదక్ – 6
  20. పెద్దపల్లి – 6
  21. జయశంకర్ భూపాలపల్లి – 6
  22. గద్వాల్ – 5
  23. యాదాద్రి – 5
  24. వికారాబాద్ – 3
  25. నాగర్ కర్నూల్ – 2
  26. వనపర్తి – 1
  27. ఆదిలాబాద్ – 1
  28. మంచిర్యాల – 1
  29. నిర్మల్ – 1

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 5 =