తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,255 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. ఆదివారం నాడు కొత్తగా 894 కేసులు నమోదవగా, 8794 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 703 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70,132 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 21,420 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.01 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.76 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(894):
- జీహెచ్ఎంసీ – 147
- రంగారెడ్డి – 85
- కరీంనగర్ – 69
- పెద్దపల్లి – 62
- సిద్దిపేట – 58
- మేడ్చల్ – 51
- వరంగల్ అర్బన్ – 44
- ఖమ్మం – 44
- నిజామాబాద్ – 38
- నల్గొండ – 37
- మహబూబాబాద్ – 31
- జగిత్యాల – 31
- మహబూబ్ నగర్ – 30
- సంగారెడ్డి – 29
- జోగులాంబ గద్వాల్ – 21
- మంచిర్యాల – 17
- నాగర్ కర్నూల్ – 15
- సూర్యాపేట – 12
- ఆసిఫాబాద్ – 11
- ఆదిలాబాద్ – 10
- భద్రాద్రి కొత్తగూడెం – 9
- వరంగల్ రూరల్ – 9
- మెదక్ – 8
- జనగామ – 7
- కామారెడ్డి – 7
- ములుగు – 6
- రాజన్న సిరిసిల్ల – 2
- వనపర్తి – 2
- వికారాబాద్ -1
- యాదాద్రి భువనగిరి – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu