మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక నిర్ణయం, జూలై 30న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక

Another jolt to BJP in Telangana as ex-minister quits, bjp, Enugula Peddi Reddy to join TRS, Ex-BJP Leader Peddireddy, Ex-BJP Leader Peddireddy will Join in TRS Party, Ex-BJP Leader Peddireddy will Join in TRS Party On July 30, Former minister E Peddi Reddy quits Telangana BJP, Mango News, Peddi Reddy resigns from BJP, Peddi Reddy resigns from BJP over Eetela Rajender entry, Peddireddy To Join in TRS Party, Peddireddy will Join in TRS Party, TRS Party

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జూలై 30, శుక్రవారం నాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు పెద్దిరెడ్డి ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు. వచ్చే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ముందుగా టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజురాబాద్ కు చెందిన పెద్దిరెడ్డి, ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనను సంప్రదించలేదని పార్టీ నాయకులతో తీవ్రంగా విభేదించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కు పంపించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీలో కొనసాగలేనని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =