సీఎం కేసీఆర్ కలిసిన చాకలి ఐలమ్మ వారసులు

Chakali Ailamma, Chakali Ilamma, Chakali Ilamma Birth and Death Anniversaries Officially by State Govt, Chakali Ilamma Birth Anniversary, Chakali Ilamma birth death anniversaries, Chakali Ilamma Death Anniversary, Chakali Ilamma Family Meets CM KCR, Family Members of Chakali Ailamma, Family Members of Chakali Ailamma Meets CM KCR, Family Members of Chakali Ailamma Meets CM KCR at Pragati Bhavan, freedom fighter Chakali Ilamma, magno news, Pragati Bhavan

తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, వారి కొడుకు చిట్యాల సంపత్-చిట్యాల శ్వేత మనుమడు, మనుమరాళ్ళు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =