పోలీస్‌ భార్యకు సర్‌ప్రైజ్‌.. పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు

Hyderabad Husband Gives Big Surprise For His Police Wife by Grand Welcome,Hyderabad Husband Gives Big Surprise,Husband Gives Surprise For His Police Wife,Husband Surprise Police Wife by Grand Welcome,Hyderabad Husband Surprise,Mango News,Mango News Telugu,Husband gives grand welcome,Husband Big Surprise to Wife,A surprise for the police's wife, Hyderabad Lady police, Police Husband, Netizens,Mans celebration of cop wifes promotion,Hyderabad Husband,Hyderabad Husband Latest News,Hyderabad Husband Latest Updates,Surprise For His Police Wife Latest News,Surprise For His Police Wife Latest Updates

ప్రతి మగాడి విజయ గాథ వెనుక స్త్రీ ఉంటుందని పెద్దలు అంటుంటారు. అలాంటి సంఘటనలు కూడా చాలామంది చూసే ఉంటారు. అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆడవారి వెనుక కూడా ఓ మగాడు ఉంటాడు. కాకపోతే ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. అర్థం చేసుకునే తోడు ఉంటే ఆ ఇల్లాలికి సంసారమే స్వర్గంగా మారుతుంది. కానీ చాలామంది పురుషాహంకారంతో ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. కానీ ఓ భర్త మాత్రం తాను అందుకు విరుద్ధం అని చేసి చూపుతున్నాడు.

ఇళ్లల్లో చాలామంది భర్తలు తమదే పైచేయిగా ఉంటుంటారు. కొందరైతే భార్యల అభిరుచులను కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన సతీమణి విజయాన్ని తనదిగా ఎంతో గర్వంగా వేడుకలు జరిపి.. భార్యకు ఊహించని స్వాగతం పలికాడు. మీరు వింటున్నది నిజమే. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా చేరింది. డిపార్ట్‌మెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో.. ఇటీవల ఆమెకు ప్రమోషన్ వచ్చింది.

హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది శిక్షణకు వెళ్లింది సదరు మహిళ. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమె ఇంటికి చేరుకోగా.. కనీవిని ఎరుగని రీతిలో భర్త ఆమెకు ఓ రేంజ్‌లో వెల్‌కమ్ చెప్పాడు. తీన్మార్ బ్యాండ్ హోరు, బాణాసంచా జోరుతో.. కళ్లు చెదిరేలా ఆమెకు స్వాగతం పలికాడు. అనంతరం ఆమెను శాలువా కప్పి పూలమాలతో సత్కరించాడు. కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంచి పెట్టాడు. భర్త ఏర్పాట్లు చూసిన ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్.. ఆశ్చర్యానికి గురైంది. తనకు అనుకోనిరీతిలో వెల్‌కమ్ చెప్పటంతో ఆమె అనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇక భార్య కోసం భర్త చేసిన వేడుకలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రతి ఆడదాని విజయం వెనుక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు స్పందించగా.. ఈ కాలంలో ఇలాంటి భర్త దొరకాలంటే రాసిపెట్టి ఉండాలని మరొకరు కామెంట్ పెట్టారు. మీరు డబుల్ లక్కీ మేడం.. ప్రేమించే భర్త దొరకటంతో పాటు.. తెలంగాణ ప్రజలకు సేవ చేసే పోలీస్ శాఖను ఎంచుకున్నారు.. అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

పెళ్లాలు.. మొగుళ్లను ప్రశాంతంగా ఉండనిస్తే ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు అని మరో నెటిజన్ ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు. దేవుడా.. నాకూ ఇలాంటి మంచి మొగుడు రావాలయ్యా అంటూ ఓ యువతి కామెంట్ చేయగా.. ఆడు నిజంగా మగాడ్రా బుజ్జి అంటూ ఆ భర్తను ఆకాశానికెత్తేస్తున్నారు ఇంకొంతమంది నెటిజన్స్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 2 =