కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం, రెబల్ స్టార్ కి ఆయన నిజమైన నిర్వచనం: చిరంజీవి

Megastar Chiranjeevi Pays Condolences after Demise of Senior Actor Rebel Star Krishnam Raju, Megastar Chiranjeevi Tribute To Krishnam Raju, Mahesh Babu Tribute To Krishnam Raju, Celebrities Pays Tribute To Krishnam Raju, Megastar Chiranjeevi , Super Star Mahesh Babu, Rebel Star Krishnam Raju, Mango News, Mango News Telugu, Senior Actor Krishnam Raju, Telugu Senior Actor Krishnam Raju, Krishnam Raju Passes Away, Krishnam Raju Dies At 83, Krishnam Raju Died, Tollywood Latest News, Krishnam Raju Last Rites

ప్రముఖ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అని, రెబల్ స్టార్ కి ఆయన నిజమైన నిర్వచనమని చిరంజీవి పేర్కొన్నారు. “శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =