అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం: వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ క‌లెక్ష‌న్ కిట్ ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Minister for Forests Indrakaran Reddy Unveils Wildlife Evidence Collection Kit Today, Telangana Forest Minister Indrakaran Reddy Unveils Wildlife Evidence Collection Kit Today, Forest Minister Indrakaran Reddy Unveils Wildlife Evidence Collection Kit Today, Minister Indrakaran Reddy Unveils Wildlife Evidence Collection Kit Today, Indrakaran Reddy Unveils Wildlife Evidence Collection Kit Today, Wildlife Evidence Collection Kit, Telangana Forest Minister Indrakaran Reddy, Minister for Forests Indrakaran Reddy, Forest Minister Indrakaran Reddy, Minister Indrakaran Reddy, Telangana Forest Minister, Indrakaran Reddy, Wildlife, Wildlife Evidence Collection Kit News, Wildlife Evidence Collection Kit Latest News, Wildlife Evidence Collection Kit Latest Updates, Wildlife Evidence Collection Kit Live Updates, Mango News, Mango News Telugu,

వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌తో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అట‌వీ శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయ పులుల దినోత్స‌వం సంద‌ర్భంగా వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ ప్ర‌త్యేకంగా రూపొందించిన వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ క‌లెక్ష‌న్ కిట్ ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్రవారం అర‌ణ్య భ‌వన్ లో ఆవిష్క‌రించారు. కిట్ ప‌ని తీరు, సాంపిల్స్ సేక‌ర‌ణ‌, వైల్డ్‌లైఫ్ డీఎన్ఏ పరీక్షల‌ విశ్లేషణ, త‌దిత‌ర అంశాల‌ను వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ప్రతినిదులు మంత్రికి వివ‌రించారు. వ‌న్య‌ప్రాణుల వ‌ధించిన‌ప్పుడు నేర ప‌రిశోధ‌నలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాల‌ను సేక‌రించ‌డం, లేదా అవి స‌హ‌జ మ‌ర‌ణం పొందిన‌ప్పుడు కానీ వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు,పెంట, మాంసాహార అవశేషాల సేక‌రించి వాటి డీఎన్ఏ ప‌రీక్ష‌ల కోసం Z.S.I., W..I.I., CCMB కి పంపుతామ‌ని తెలిపారు. విచార‌ణ స‌మ‌యంలో న్యాయ‌స్థానాల్లో ఈ ప‌రీక్ష‌ల రిపోర్టును స‌మ‌ర్పించిన‌ప్పుడు, వాటి ఆధారంగా వేట‌గాళ్ళ‌కు శిక్ష ప‌డే అవకాశం ఉంటుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ, నేర ప‌రిశోధ‌న‌లో ఆధారాల సేక‌ర‌ణ‌లో పోలీస్ లకు ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీల‌క‌మైంద‌ని, అలాగే అంత‌రించిపోతున్న వ‌న్య‌ప్రాణుల రక్షణకు ఇలాంటి ఆధునిక శాస్త్రీయ ప‌ద్ధ‌తులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని అన్నారు. బ‌యోలాజిక‌ల్ ఎవిడెన్స్ ద్వారా వేట‌గాళ్ళ‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని, త‌ద్వారా వేట‌గాళ్ళు జంతువుల‌ను వ‌ధించే ఘ‌ట‌న‌లు త‌గ్గుముఖం పడ‌తాయ‌ని తెలిపారు. ఈ కిట్స్ ద్వారా సాంపిల్ సేక‌ర‌ణ‌, దాన్ని ఎలా ఉప‌యోగించాల‌నే దానిపై అట‌వీ శాఖ అధికారుల‌కు శిక్ష‌ణను ఇచ్చి ఈ కిట్ల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు.

అభ‌యార‌ణ్యాలు, వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రాలు, అన్ని అట‌వీ డివిజ‌న్ల‌లో ఈ కిట్స్ ను సాంపిల్ సేక‌ర‌ణ‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో అట‌వీ అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వంటేరు ప్ర‌తాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంక‌టర‌మ‌ణ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, హైద‌రాబాద్ టైగ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ డైరెక్ట‌ర్ ఇమ్రాన్, డబ్ల్యూసీఎస్ ఇండియా లీగ‌ల్ హెడ్ శ్యామ.కే, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 10 =