16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల, యువతకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Responds over 16614 Jobs Recruitment in Police Department, Harish Rao Responds over 16614 Jobs Recruitment in Police Department, Minister Harish Rao, Telangana Minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Telangana Govt Releases Police Recruitment Notification for 16614 Posts, Police Recruitment Notification for 16614 Posts, TRS Govt Releases Police Recruitment Notification for 16614 Posts, Police Job Recruitment Notification, Telangana Police Recruitment 2022, 2022 Telangana Police Recruitment, Telangana Police Recruitment, Telangana Govt is all set to recruit over 16614 police personnel for the state, Telangana Police Recruitment For 16614 Posts, Telangana Police Recruitment News, Telangana Police Recruitment Latest News, Telangana Police Recruitment Latest Updates, Telangana Police Recruitment Live Updates, Telangana Govt, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ముందుగా ఏప్రిల్ 25, సోమవారం నాడు 16,614 పోలీసు ఉద్యోగాల‌కు ప్రభుత్వం నోటిఫికేష‌న్‌ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్‌ పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. “తెలంగాణ యువత బంగారు భవిష్యత్తుకై సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ లో 587ఎస్సై, 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యువత సరైన విధంగా పరీక్షలకు సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 16 =