రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, నేటి నుంచి మంత్రి కేటీఆర్‌ బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ దేశాల పర్యటన

Minister KTR 10 Day Trip of London and Switzerland To Pull Heavy Investments For Telangana, KTR 10 Day Trip of London and Switzerland To Pull Heavy Investments For Telangana, Telangana Minister KTR 10 Day Trip of London and Switzerland To Pull Heavy Investments For Telangana, Telangana Minister KTR 10 Day Trip of London To Pull Heavy Investments For Telangana, Telangana Minister KTR 10 Day Trip of Switzerland To Pull Heavy Investments For Telangana, Minister KTR 10 Day Trip, Minister KTR 10 Days foreign Tour, Minister KTR 10 Days foreign Tour News, Minister KTR 10 Days foreign Tour Latest News, Minister KTR 10 Days foreign Tour Latest Updates, Minister KTR 10 Days foreign Tour Live Updates, London and Switzerland, Heavy Investments For Telangana, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించమే లక్ష్యంగా పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌తో పాటు స్విట్జర్లాండ్‌ దేశాలలో వివిధ పరిశ్రమల అధిపతులను, సిబ్బందిని కలవనున్నారు. దీనిలో భాగంగా మొదటగా లండన్‌కు వెళ్లనున్నారు. లండన్‌లో మూడు రోజుల పాటు పలు ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవోలతో సమావేశం కానున్నారు. తద్వారా వారిని తెలంగాణాలో పెట్టుబడులకు ఒప్పించనున్నారు. మే 17 నుంచి 21 వరకు లండన్‌లో పర్యటించనున్న కేటీఆర్.. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. దీనిని మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అనంతరం మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఆ సదస్సులో ప్రపంచ దేశాల రాజకీయ వ్యాపార ప్రముఖులతో చర్చలు జరుపనున్నారు. అలాగే ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు’ అనే ముఖ్యమైన అంశంపై సభికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. మే 26న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్న మంత్రి కేటీఆర్‌ బృందంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ సహా సంబంధిత శాఖల అధికారులు పలువురు ఉన్నారు. ఒక నెల క్రితం మంత్రి ఇదేవిధంగా పదిరోజుల పాటు అమెరికా పర్యటన చేసిన విషయం తెలిసిందే. కాగా 12 ఏళ్ల తర్వాత కేటీఆర్ లండన్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో వెస్ట్ లండన్ లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =