మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటన: తెలంగాణకు రానున్న ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ ‘మాస్ట‌ర్‌కార్డ్‌’

Minister KTR Davos Tour Telangana Govt Signs MOU with Mastercard To Formalize Digital State Partnership, Telanagan Minister KTR Davos Tour Telangana Govt Signs MOU with Mastercard To Formalize Digital State Partnership, KTR Davos Tour Telangana Govt Signs MOU with Mastercard To Formalize Digital State Partnership, Telangana Govt Signs MOU with Mastercard To Formalize Digital State Partnership, Telangana Govt Signs MOU with Mastercard, TS Govt Signs MOU with Mastercard, Formalize Digital State Partnership, KTR Davos Tour, Minister KTR Davos Tour, Minister KTR Davos Tour News, Minister KTR Davos Tour Latest News, Minister KTR Davos Tour Latest Updates, Minister KTR Davos Tour Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆహ్వానించాలన్న లక్ష్యంతో దావోస్‌ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రముఖ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ ‘మాస్ట‌ర్‌కార్డ్‌’ తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోర‌మ్ స‌ద‌స్సుకు హాజ‌రైన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మాస్ట‌ర్‌కార్డ్ అధ్య‌క్షుడు మైఖేల్ ఫ్రోమెన్ తో భేటీ అయ్యారు. ఈ మేరకు డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగినట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మాస్ట‌ర్‌కార్డ్‌ సహకారంతో రాష్ట్రంలో వ్యాపార రంగ సేవ‌ల‌ను అత్యంత వేగంగా డిజిటలైజ్ చేయ‌వ‌చ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో కుదిరిన డీల్ వలన ప్ర‌పంచ స్థాయిలో ప‌రిష్కారాల‌ను అందించ‌గలుగుతామని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారాలు సహా రైతులకు కూడా డిజిట‌ల్ సేవ‌ల‌ను అందించ‌వ‌చ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మాస్టర్‌కార్డ్ పంపిణీలు, వ్యవసాయ రంగ డిజిటలైజేషన్, సైబర్‌ సెక్యూరిటీ మరియు డిజిటల్ అక్షరాస్యతతో సహా పలు ప్రాధాన్యతా రంగాలలో రాష్ట్రంతో సహకరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =