బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌కు ఆదేశాలు, అధికారి అత్యుత్సాహంపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

Telangana Minister KTR Orders To Suspend Bellampally Municipal Commissioner For His Over Enthusiastic Behaviour, Minister KTR Orders To Suspend Bellampally Municipal Commissioner For His Over Enthusiastic Behaviour, KTR Orders To Suspend Bellampally Municipal Commissioner For His Over Enthusiastic Behaviour, Suspend Bellampally Municipal Commissioner For His Over Enthusiastic Behaviour, municipal commissioner in Telangana was placed under suspension for issuing notices to subordinates, Bellampally Municipal Commissioner G Gangadhar Suspended, G Gangadhar Bellampally Municipal Commissioner, Bellampally Municipal Commissioner, over enthusiastic Bellampally Municipal Commissioner G Gangadhar Suspended, Bellampally Municipal Commissioner News, Bellampally Municipal Commissioner Latest News, Bellampally Municipal Commissioner Latest Updates, Bellampally Municipal Commissioner Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

అత్యుత్సాహంతో వ్యవహరించిన ఒక అధికారిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ అధికారి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో పాల్గొనలేదని పేర్కొంటూ బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి పురపాలక ఉద్యోగులకు కమిషనర్‌ నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగించింది.

ఈ క్రమంలో విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టి రాగా బెల్లింపల్లి కమిషనర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని మంత్రి సీడీఎంను ఆదేశించారు. ఈ తరహా అభిమానాన్ని తాను కోరుకోమని, ఇలాంటి వాటిని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తిననంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న కారణంగా ఈసారి తన జన్మదినాన్ని జరుపుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. అయినాసరే సిబ్బంది తీరు మార్చుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మంత్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =