చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది, పరిశ్రమ మంచినటుడిని కోల్పోయింది – నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Pays Condolences after the Demise of Tollywood Veteran Actor Chalapathi Rao,Nandamuri Balakrishna Pays Condolences,Nandamuri Balakrishna Griefed,Nandamuri Balakrishna,Mango News,Mango News Telugu,Condolences To Actor Chalapathi Rao,Actor Chalapathi Rao Son,Chalapathi Rao Young,Chalapathi Rao Death,Chalapathi Rao Age,Actor Chalapathi Rao Family Photos,Chalapathi Rao Wife,Chalapathi Rao Daughter,Chalapathi Rao Movies,Chalapathi Rao Telugu Actor,Actor Chalapathi Rao Age,Actor Chalapathi Rao,Actor Chalapathi,Chef Chalapathi Rao,Telugu Actor Chalapathi Rao,Chalapathi Rao Actor,Actor Chalapathi Rao Wife

ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. “చలపతిరావు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావుకి అవినాభావ సంబంధం వుంది. నాన్న ఎన్టీఆర్ తో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =