తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

PM Modi and Several Political Leaders Film Celebrities Extends Birthday Wishes to Telangana CM KCR,CM KCR's Birthday,CM KCR's birthday tomorrow,Many service programs,BRS leaders across Telangana,Mango News,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేస్తూ, “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మీ జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు జాతీయ రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంతో పాటుగా అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకొంటున్నారు. రక్తదానం, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు, పలు చోట్ల మహిళలకు చీరలు, ప్రజలకు దుస్తుల పంపిణీ, ఇక పలు నగరాల్లో సీఎం కేసీఆర్‌ కప్‌ పేరిట క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్స్, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో పాటుగా, సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రముఖ దేవాలయాల్లో పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + two =