హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే…

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Mango News, Second Phase Corona Vaccination News, Second Phase Corona Vaccination Started, Second Phase Corona Vaccination Started in Telangana, telangana, Telangana Second Phase Corona Vaccination

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 45 ప్రభుత్వ, 57 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 102 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. www.cowin.gov.in పోర్టల్ సోమవారం ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌/ఆధార్‌ నంబర్ ద్వారా www.cowin.gov.in పోర్టల్ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించనునుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు. 60 ఏళ్ళు పైబడినవారికి గుర్తింపు కోసం ఆధార్‌, ఓటర్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్ పాస్ పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ తదితర గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నారు. అలాగే 20 రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వారికీ మాత్రమే ఈ విడతలో కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వీరంతా వయస్సుకు సంబంధించి గుర్తింపు కార్డుతోపాటు, సంబంధిత రిజిస్టర్డ్ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ నుంచి ధ్రువీకరణ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ వేసే ప్రభుత్వ ఆసుపత్రులు:

  • గాంధీ
  • ఉస్మానియా
  • ఫీవర్‌
  • ఈఎన్‌టీ
  • సరోజినీ దేవి ఐ ఆసుపత్రి,
  • డీహెచ్‌ కింగ్‌ కోఠి ఆసుపత్రి
  • ఏహెఛ్ మలక్‌పేట్‌
  • ఏహెఛ్ గోల్కొండ
  • ఏహెఛ్‌ నాంపల్లి
  • పాల్దార్‌ యూపీహెచ్‌సీ
  • నిజామియా టీబీ ఆసుపత్రి
  • ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌

రంగారెడ్డి:

  • ఏహెఛ్ వనస్థలిపురం
  • డీహెఛ్ కొండాపూర్‌

హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ వేసే ప్రైవేట్ ఆసుపత్రులు:

  • బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి
  • అపోలో ఆసుపత్రి ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌- జూబ్లీహిల్స్‌
  • అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌
  • యశోద – సికింద్రాబాద్‌
  • ప్రిన్సిస్‌ ఎస్రా ఆసుపత్రి (డీసీఎంఎస్‌)
  • యశోద – సోమాజిగూడ
  • మెడికవర్‌ ఆసుపత్రి ఏ యూనిట్‌ ఆఫ్‌ సహృదయ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌- సెక్రెటేరియట్‌
  • ప్రతిమ ఆసుపత్రి ఏ యూనిట్‌ ఆఫ్‌ శ్రీసాయి బాలాజీ హెల్త్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • క్వాంటిటీ కేర్ ఇండియా లిమిటెడ్ – నాంపల్లి
  • సెంచరీ ఆసుపత్రి
  • కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ లిమిటెడ్‌
  • కేర్‌ ఆసుపత్రి-బంజారాహిల్స్‌

రంగారెడ్డి:

  • భాస్కర్‌ జనరల్‌ ఆసుపత్రి
  • బ్రిసిల్‌కాన్‌ ఆసుపత్రి, కాంటినెంటల్‌
  • కామినేని ఆసుపత్రి
  • యశోద – మలక్ పేట
  • కాంటినెంటల్ ఆసుపత్రి
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =