కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీ-కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, త్వరలో బీజేపీలో చేరే అవకాశం?

T-Congress Senior Leader Marri Shashidhar Reddy Meets Union Home Minister Amit Shah Likely To Joins BJP Soon,Senior T-Congress Leader Marri Shasidhar Reddy, Union Home Minister Amit Shah,Shasidhar Reddy To Join Bjp,Mango News,Mango News Telugu, Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Telangna Latest News And Updates,Telangna Politics, All India Congress Party,Telangana News,Telangana Political News,Hyderabad Political News,Telangana Political Map,Telangana Political Names,K. Chandrashekar Rao,Chief Minister Of Telangana

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) మాజీ వైస్ చైర్మన్, మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణలతో కలిసి ఢిల్లీ చేరుకొని అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. ఇక శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సంప్రదించి ఆయన ఆమోదం తీసుకున్న తర్వాత పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇక గత కొంతకాలంగా శశిధర్ రెడ్డి సహా పార్టీలోని ఇతర సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా అసంతృప్తితో ఉంటున్నారు. రేవంత్ సీనియర్‌ నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన ఏకపక్ష ధోరణి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని అధిష్టానానికి సైతం కొందరు ఫిర్యాదు కూడా చేశారు. ఇక దీనికి తోడు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోలోవడం, కనీసం డిపాజిట్ కూడా దక్కపోవడం వంటి పరిణామాల తర్వాత మరికొంత మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు వార్తలు వెలువడటం టీ-కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =