తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 23, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 50,826 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13,367 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 662, రంగారెడ్డిలో 213, వరంగల్ అర్బన్‌లో 75, రాజన్న సిరిసిల్లలో 62, మహబూబ్‌నగర్ లో 61, నాగర్‌కర్నూల్ లో 51, నల్గొండలో 44, సూర్యాపేటలో 39, నిజామాబాద్ లో 38, కరీంనగర్ లో 38, మేడ్చల్ లో 33, సంగారెడ్డిలో 32, మెదక్‌లో 27, జయశంకర్ భూపాలపల్లిలో 25, వరంగల్ రూరల్ లో 22, జనగామలో 22, మహబూబాబాద్‌లో 18, కామారెడ్డిలో 17, ఆదిలాబాద్ లో 17, ములుగులో 17, జగిత్యాలలో 14, ఖమ్మంలో 10 నమోదయ్యాయి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 23, సాయంత్రం 5 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 50,826
- కొత్తగా నమోదైన కేసులు (జూలై 22 – జూలై 23 (5PM-5PM) : 1567
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 39,327
- యాక్టీవ్ కేసులు : 11,052
- మొత్తం మరణాల సంఖ్య : 447
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu