ఉమెన్స్ డే సందర్భంగా.. 27 మంది మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్రభుత్వం పుర‌స్కారాలు, రూ.లక్ష నగదు రివార్డ్

Telangana Govt Announces Awards and Rs.1 Lakh Cash Reward For 27 Women on The Occasion of International Women's Day,Telangana Govt Announces Awards,Rs.1 Lakh Cash Reward,27 Women on Occasion of International Women's Day,International Women's Day,Mango News,Mango News Telugu,Telangana CM KCR,CM KCR,Telangana CM KCR Latest News And Updates,Telangana International Women's Day,Telangana Women's Day,Women's Day Celebrations,Women's Day

అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ‌ ప్రభుత్వం ‘తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు’ ప్రకటించింది. ఈ మేరకు పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది (2023) మొత్తం 27 మంది మహిళలకు అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని కూడా అందజేయనున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సందర్భంగా సెర్ప్‌, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. దీనికి సంబంధించి ఈనెల 8న రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అవార్డులు పొందిన 27 మ‌హిళ‌లు వీరే..

  • బానోతు జ్యోతి – అంగ‌న్‌వాడీ టీచ‌ర్
  • ఎం. కృష్ణవేణి – ఆశా వ‌ర్కర్
  • ఇందిర – ఏఎన్ఎం
  • గుండా రాజ‌కుమారి – సెంట‌ర్ కోఆర్డినేట‌ర్, భ‌రోసా సెంట‌ర్
  • ఆల్ఫి కిండ‌న్‌జెన్ – సోష‌ల్ స‌ర్వీస్
  • మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే స‌ర్పంచ్
  • డాక్టర్ అనురాధ త‌డ‌క‌మ‌ళ్ల – క్లాసిక‌ల్ డ్యాన్స్
  • దంటు క‌న‌క‌దుర్గ – సోష‌ల్ యాక్టివిస్ట్
  • సుజాత దీక్షిత్ – థియేట‌ర్
  • స్వరూప పొట్లప‌ల్లి – జ‌ర్నలిజం
  • డాక్టర్ బండారు సుజాత శేఖ‌ర్ – ఫోక్ లిట‌రేచ‌ర్
  • క‌ర్నె శంక‌ర‌మ్మ – కిన్నెర‌, ఫోక్
  • అరుణ నార‌ద‌భ‌ట్ల – లిట‌రేచ‌ర్
  • డాక్టర్ అమూల్య మ‌ల్లన్నగారి – హెల్త్
  • నారా విజ‌య‌ల‌క్ష్మి (పీహెచ్) – పెయింట‌ర్
  • ఓఎన్ఐ సిస్టర్స్(వినోద‌, విజ‌య‌, విజ‌య‌ల‌క్ష్మి) – మ్యూజిక్
  • త్రిష గొంగ‌డి – స్పోర్ట్స్ (అండ‌ర్ -19 క్రికెట‌ర్)
  • డాక్టర్ మాల‌తి – హెల్త్, సూప‌రింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్ల‌బుర్జ్
  • స‌మంత రెడ్డి – ఉమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్
  • డాక్టర్ గుడూరు మ‌నోజ – ఆద్య క‌ళ‌
  • సామ‌ళ్ల శ్వేత – క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్
  • జి. నందిని – సూప‌ర్‌వైజర్, నిజామాబాద్ (అ) ప్రాజెక్ట్
  • ర‌జియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిప‌ల్లి, ఐసీడీఎస్ – న‌ర్సాపూర్
  • డాక్టర్ కే రాణి ప్రసాద్ – లిట‌రేచ‌ర్
  • రుక్మిణి, ఇన్‌స్పెక్టర్ – షీ టీమ్స్ భ‌రోసా సెంట‌ర్
  • అన‌సూయ‌, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్
  • అన్వితా రెడ్డి – మౌంటెయిన‌ర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =