తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు, 1-9వ తరగతుల విద్యార్థులు ప్రమోట్

Telangana Govt teachers may get summer vacation, Mango News, summer holidays to schools, Summer Holidays to TS Schools, Telangana Rashtra Samithi, Telangana Schools, Telangana schools summer vacation to begin, Telangana Schools To Have Summer Vacation, Telangana Schools To Have Summer Vacation From 26th April, TS School Holidays 2021a Govt Announces Summer Holidays for Schools, Junior Colleges from April 27 to May 31st

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.

1-9వ తరగతుల విద్యార్థులు ప్రమోట్: 

అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్-19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =