హోంశాఖలో 7వేల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telangana Govt Approves Recruitment of 7,000 Vacancies Across Home Department

తెలంగాణ హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మొత్తం 5,000 పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ అధికారికంగా ఉత్తర్వులు (GOs) జారీ చేసింది. పోలీస్ శాఖలో ఉన్న సిబ్బంది కొరతను అధిగమించడానికి, అలాగే గత కొద్ది రోజులుగా అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్లు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TSLPRB) ద్వారా ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (నేరుగా భర్తీ) పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

ఈ నియామక ఉత్తర్వులలో 5వేల పోలీస్ పోస్టుల పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • సివిల్ కానిస్టేబుల్: 3,697 పోస్టులు

  • ఆర్మ్డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్: 1,052 పోస్టులు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్ SI): 148 పోస్టులు

  • ఫింగర్ ప్రింట్ బ్యూరో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ASI): 23 పోస్టులు

  • స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్స్ (SAR CPL) కానిస్టేబుల్: 24 పోస్టులు

  • డ్రైవర్ కానిస్టేబుల్: 20 పోస్టులు

  • ఆర్మ్డ్ రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (AR SI): 14 పోస్టులు

  • తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) రిజర్వ్ ఎస్సై: 12 పోస్టులు

  • మెకానిక్ కానిస్టేబుల్: 7 పోస్టులు

  • ఎస్‌ఏఆర్ సీపీఎల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SAR CPL SI): 3 పోస్టులు

ఈ నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా మరియు పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ఆర్థిక శాఖ బోర్డు అధికారులను ఆదేశించింది. స్థానిక కేడర్ వారీగా ఉన్న ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు మరియు సిలబస్‌ను హోంశాఖ మరియు డీజీపీ కార్యాలయం నుంచి సేకరించి వెరిఫై చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే పరీక్షల షెడ్యూల్, పూర్తి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద ఊరట లభించినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here