తెలంగాణలో నేటి రాత్రితో ముగియ‌నున్న‌ పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు ప్ర‌క్రియ గడువు

Telangana Today is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Today is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Last Date For Job Applications of TS Police Recruitment 2022, TS Police Recruitment 2022, 2022 TS Police Recruitment, TS Police Recruitment, Last Date For Job Applications, Telangana State Level Police Recruitment Board, TSLPRB will close down the application process for TS Police Recruitment 2022 on May 20, TSLPRB Says Today is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Telangana State Level Police Recruitment Board Says Today is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Telangana Police Recruitment 2022, Today is The Last Date For Job Application Of Police Recruitment, TS Police Recruitment News, TS Police Recruitment Latest News, TS Police Recruitment Latest Updates, TS Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజుతో ముగించనుంది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉందని పోలీస్‌ శాఖ తెలిపింది. తెలంగాణ పోలీస్‌ శాఖలోని సాధారణ పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు మరియు రవాణా శాఖ వంటి వివిధ విభాగాల్లో మొత్తం 17,291 ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వ‌ర‌కు 5.2 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చాయని తెలంగాణ పోలీసు శాఖ ప్రకటించింది. కాగా నిన్న ఒక్క రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఇక మహిళా అభ్య‌ర్థుల నుంచి కూడా భారీగా 2 లక్షలకు పైగా దర‌ఖా‌స్తులు వచ్చా‌యని తెలిపింది. ప్రస్తుతం అందిన దర‌ఖా‌స్తుల్లో బీసీ అభ్య‌ర్థులు 52 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 19 శాతం, ఓసీలు 7 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గడువు నేటితో ముగియనున్నందున ఆసక్తి గల అభ్యర్థులు tslprb.in అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

ఖాళీల వివరాలు
  • SCT PC సివిల్ మరియు / లేదా సమానమైన పోస్ట్‌లు: 15644
  • SCT SI సివిల్ మరియు / లేదా సమానమైన పోస్ట్‌లు: 554
  • SCT PCలు IT & CO / మెకానిక్ / డ్రైవర్: 383
  • SCT SI IT & CO / SI PTO / ASI FPB: 33
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు: 614
  • ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు: 63
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =