తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ‘శ్రీ శుభకృత్ నామ సంవత్సర’ ఉగాది శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

TRS MLC Kalvakuntla Kavitha Extends Greetings For Telangana People of Ugadi Festival, TRS MLC Kalvakuntla Kavitha, TRS MLC Kalvakuntla Kavitha Extends Greetings For Ugadi Festival, TRS MLC Kalvakuntla Kavitha Extends Wishes For Ugadi Festival, TRS MLC Kalvakuntla Wishes For Ugadi Festival, TRS MLC Kalvakuntla Greetings For Ugadi Festival, Ugadi Festival Greetings, Ugadi Festival Wishes, Ugadi Festival, TRS MLC, Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha Wishes, Kalvakuntla Kavitha Greetings, Ugadi, Mango News, Mango News Telugu,

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా.. ఎమ్మెల్సీ కవిత ప్రజలకు ఒకరోజు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా తెలంగాణ‌కు పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు పెట్టుబడులకు ముందుకొచ్చాయని, వాటి ద్వారా తెలంగాణ యువ‌త‌కు ల‌క్ష‌లాది ఉద్యోగాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కొత్త ఉగాది, తెలంగాణ లోని నిరుద్యోగులకు ఉద్యోగ నామ సంవత్సరంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కవిత తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన్ని తెలంగాణ ప్రజానీకం అంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సరం.. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా తెలంగాణ‌కు పెద్ద సంఖ్య‌లో ప‌రిశ్ర‌మ‌లు పెట్టుబడులకు ముందుకొచ్చాయని, వాటి ద్వారా తెలంగాణ యువ‌త‌కు ల‌క్ష‌లాది ఉద్యోగాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్ర‌భుత్వ శాఖలలో ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో దాదాపు 90 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. కాగా ఈ ప‌రీక్ష‌ల‌కు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ‘టీ శాట్‌’ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కవిత పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here