తెలంగాణలో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 82 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

TSNPDCL Issues Notification For The Recruitment of 82 Electrical AE Posts in Telangana, Recruitment of 82 Electrical AE Posts in Telangana, 82 Electrical Assistant Engineer Posts, TSNPDCL Issues Notification For The Recruitment of 82 Electrical AE Posts, TSNPDCL Recruitment 2022, 2022 TSNPDCL Recruitment, TSNPDCL Recruitment, Telangana State Northern Power Distribution, Telangana State Northern Power Distribution Issues Notification For The Recruitment of 82 Electrical AE Posts in Telangana, 82 Electrical AE Posts, Electrical AE Posts, Electrical Assistant Engineer Posts, TSNPDCL, Telangana Electrical AE Posts News, Telangana Electrical AE Posts Latest News, Telangana Electrical AE Posts Latest Updates, Telangana Electrical AE Posts Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం రోజుకొక శుభవార్త చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలోని మొత్తం 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఇప్పటి వరకు 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ క్రమంలో శనివారం ఇంకో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిలో భాగంగా తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంట్ లోని మొత్తం 82 ఖాళీలను దీనిద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగార్హత, పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం..

టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో మొత్తం పోస్టులు: 82 (ఏఈ)
  • దరఖాస్తుల స్వీకరణ తేదీ: జూన్ 27 – జూలై 11
  • రాతపరీక్ష జరుగు తేదీ: ఆగస్టు 14
  • పరీక్ష జరుగు సమయం: ఉదయం 10.30 – 12.30 వరకు
  • సాధారణ అభ్యర్థులకు వయస్సు: 18 – 44 (సంవత్సరాల మధ్య ఉండాలి)
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి: 5 ఏళ్ళు మినహాయింపు
  • దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి: 10 ఏళ్ళు మినహాయింపు
  • విద్యార్హత: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి
  • ఇతర వివరాలకు సంప్రదించవల్సిన వెబ్‌సైట్‌: http://tsnpdcl.cgg.gov.in
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + two =