181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

SPSC Releases Notification for 181 Posts of Extension Officer Grade1 in Women Development and Child Welfare Department, TSPSC Notifies 181 Vacancies Of Extension Officer, Women Development and Child Welfare Department, Extension Officer Grade1, TSPSC Recruitment 2022 Notification , Mango News, Mango News Telugu, TSPSC Extension Officer Recruitment 2022, TSPSC Extension Officer Jobs 2022, TSPSC Extension Officer Notification, TSPSC Recruitment Latest News And Updates, TSPSC 2022 News And Live Updates, WDCW Department , Telangana Government

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-I ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ తాజాగా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హత కలిగిన మహిళా అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 29 (సాయంత్రం 5 గంటల వరకు) అని, అలాగే ఫీజు చెల్లింపు సమర్పణకు కూడా సెప్టెంబర్ 29 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇక పరీక్షకు 7 రోజుల ముందు నుండి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చుని పేర్కొన్నారు. ఈ పోస్టులకు స్కేల్ ఆఫ్ పే రూ.35,720–రూ.1,04,430 ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =