బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసీఫ్ బస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో గల ఆయన అపార్టుమెంట్లో గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలు, సంబంధిత వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నటుడు అపార్టుమెంటుకు పోలీసులు, ఫోరెన్సిక్ బృందం చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కై పో చే, ఏక్ విలన్, ఫ్రీకీ అలీ, హిచ్కీ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి, క్రిష్-3, జబ్ వీ మెట్, బ్లాక్ ఫ్రైడే వంటి అనేక బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి, తన నటనతో ఆకట్టుకున్నారు. టీవీ రంగంతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. నటుడు ఆసీఫ్ బస్రా మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ