బీహార్ సీఎంగా నవంబర్‌ 16 న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం?

Bihar, Bihar CM, Bihar CM JDU Chief Nitish Kumar, Bihar Election Result 2020 LIVE Updates, bihar political news, Bihar Political Updates, bihar politics, JDU Chief Nitish Kumar, JDU Chief Nitish Kumar likely to take Oath as Bihar CM, Mango News, Nitish Kumar likely to take Oath as Bihar CM, Nitish Kumar to take Oath as Bihar CM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి అనంతరం నవంబర్‌ 16 వ తేదీన నితీష్‌కుమార్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. బీహార్ సీఎంగా నితీష్‌ కుమార్‌ ఏడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఆయన 14 సంవత్సరాలకు పైగా సీఎం పదవిలో ఉండగా, ఈ టర్మ్ తో బీహార్ లో అత్యధిక కాలం పదవిలో ఉన్న సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీకి 74 సీట్లు, జేడీయూకి 43, వీఐపీకి 4, హెఛ్ఏఎంసెక్యూలర్ కు 4 సీట్లు లభించాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =